శ్రీ ఆంధోల్ మైసమ్మ దేవస్థానం హుండీ ఆదాయం రూ. 15.13 లక్షలు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆంధోల్ మైసమ్మ దేవస్థానం హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి, సహాయ కమీషనర్ (నల్గొండ) కె. భాస్కర్ సమక్షంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ​గత 144 రోజులకు గాను భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదును లెక్కించగా మొత్తం రూ. 15,13,204/- (పదిహేను లక్షల పదమూడు వేల రెండు వందల నాలుగు రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) సల్యాది మోహన్ బాబు తెలిపారు. ఇందులో నోట్ల రూపంలో రూ. 14,26,800/- రాగా, చిల్లర నాణేల రూపంలో రూ. 86,404/- వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డితో పాటు ధర్మకర్తలు జోస్నగంటి దాసు, డి. రాజేష్, డి. రాజీవ్, ఇ. బాబు, ఎస్. ఆనంద్ రెడ్డి, వి. శివ చారి, బి. నరసింహ, ఎం. మహేందర్ రెడ్డి, బి. యువరాజు, పి. రమేష్, బి. శ్రీకాంత్, సి. హెచ్ నబిత, ఉప సర్పంచ్ మీసాల నరసింహ, మాజీ సర్పంచ్ వెలువర్తి యాదగిరి, ఈడుదుల మస్తాన్ బాబు, సి. హెచ్ జంగయ్య, జంగారెడ్డి, శ్రీవారి సేవ సమితి సభ్యులు, ఎ. నరేష్, హెడ్ కానిస్టేబుల్ పి. శ్రీహరి, ఎస్.జి. ఎ. సత్తి రెడ్డి, జూనియర్ అసిస్టెంట్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.