బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది..
మృతులకు కుంజా సూర్య నివాళి
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య, అర్రెం బిక్షపతి శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య శనివారం వారి నివాసాలకు వెళ్లి పార్థివదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అదేవిధంగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గూగులోత్ రాజమ్మ గుండెపోటుతో మృతిచెందడంతో ఆమె పార్థివదేహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రసాపూత్ సీతారామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింత క్రాంతి, ములుగు మండల కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు నల్లెల్ల భరత్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, యూత్ నాయకులు తిరుపతి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
