AP | విజయవాడ కరోనా కలకలం..
న్యూ జిజిహెచ్ లో బయటపడిన కేసు.
13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ..
తిరువూరుకు చెందిన మహాలక్ష్మికి వైరస్ సోకినట్లు వెల్లడి…
కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు..
బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ
AP | (విజయవాడ ఆంధ్రప్రభ ) : విజయవాడ నగరంలోని న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో 13ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మహాలక్ష్మికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. దీంతో ఆమెను ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
