మంత్రి త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సి. సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నమంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని భగవంతుడిని ప్రార్థించామని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మంత్రి త్వరగా కోలుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. బిజ్వార్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు లింగం, వార్డు సభ్యుడు కొక్కు మల్లేష్ నాయకులు కార్యకర్తలు గోపాల్ రెడ్డి, అశోక్, శంకర్, రాఘవేందర్ గౌడ్, బండి నరేష్, ఎల్లప్ప బసిరెడ్డి చందు తదితరులు పాల్గొన్నారు.