recruitment-2026 | రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాలు..

recruitment-2026 | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) శుభవార్త తెలిపింది. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్–2026 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) : 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-III : 6,234 పోస్టులు, మొత్తం పోస్టులు : 6,557,
విద్యార్హతలు : పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.

టెక్నీషియన్ గ్రేడ్ – I : సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమాన అర్హత.
టెక్నీషియన్ గ్రేడ్ – III : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా నిర్దేశిత సాంకేతిక అర్హత.
వయోపరిమితి :
టెక్నీషియన్ గ్రేడ్ – I : 18 నుంచి 33 సంవత్సరాలు.
టెక్నీషియన్ గ్రేడ్ – III : 18 నుంచి 30 సంవత్సరాలు.

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
ఇతర వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం : జూన్ 30, 2026
చివరి తేదీ : జూలై 29, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : జూలై 31, 2026
దరఖాస్తు సవరణలు : ఆగస్టు 1 నుంచి 10, 2026
ఎంపిక విధానం : అభ్యర్థులను ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీటీ) ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర అర్హతల పరిశీలన, అవసరమైన ప్రక్రియలు నిర్వహిస్తారు.
పే స్కేల్ : 7వ వేతన సంఘం ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు వేతనం చెల్లిస్తారు.
టెక్నీషియన్ గ్రేడ్ – I : నెలకు రూ.29,200
టెక్నీషియన్ గ్రేడ్ – III : నెలకు రూ.19,900 , వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రావెల్ అలవెన్స్ తదితర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి.