ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు.సురేంద్రనాథ్…


ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో : స్థానిక జిల్లా పౌరసంబంధాధికారి కార్యాలయం శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా “బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘనవ్యర్థాలు నిర్వహణ నియమాలు మరియు పరిశుభ్రత పట్ల అవగాహన” థీమ్ తో జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు. సురేంద్రనాథ్, డిపిఆర్వో సి.హెచ్.కనకదుర్గ ప్రసాదు లింగం, సిబ్బంది చీపుర్లు చేతబట్టి కార్యాలయ ప్రాంగణంలో శుభ్రంచేసి, ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను వేరివేసి డస్ట్ బిన్లో వేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరుయు.సురేంద్రనాథ్ మాట్లాడుతూ, స్వచ్ఛమైన పరిసరాలు, పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు నిర్మాణమే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్, క్యారీ బ్యాగులను వినియోగాన్ని తగ్గించడం, చెత్తను తడి–పొడి వ్యర్థాలుగా వేసి ఇవ్వడమే ఒక మంచి అలవాటుగా చేసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని కోరారు.

డిపిఆర్వో సి.హెచ్.కనకదుర్గ ప్రసాదు లింగం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలు సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవియస్ సి.హెచ్.శ్రీనివాస నెహ్రూ, సిబ్బంది యస్.గంగాధర్, పి.సాగర్, వి.సధ్యకమల, పి.శారద, జి.వి.వి.రత్నం పాల్గొన్నారు.