TG TET Results | ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలక అప్‌డేట్

TG TET Results | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్-2026) ఫలితాలను సోమవారం అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు.

టీజీ టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు tgtet.aptonline.in లేదా schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్లలో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను జూన్ 16 నుంచి 22 వరకు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఫలితాలతో పాటు అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను కూడా అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది.