స్వర్గీయ అందెశ్రీకి ఘన నివాళి..

తెలంగాణ గీతాన్ని ఆలపించిన విద్యార్థులు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తెలంగాణ గీత రచయిత, ప్రముఖ కవి, ప్రజా గాయకుడు స్వర్గీయ అందెశ్రీ జయంతి సందర్భంగా తాడ్వాయి మండలం దేమే కలాన్ పాఠశాలలో ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు తెలిపారు.

శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ చేసిన సాహిత్య సేవలు, ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీ స్మృతికి గుర్తుగా ఘట్‌కేసర్‌లోని ఆయన సమాధి వద్ద స్మృతివనం, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాశ్, ఉపాధ్యాయులు ఉమారాణి, ప్రతాప్ రెడ్డి, సుధాకర్, మారుతి, రాధా భాస్కర్, నారాయణ, సుజిత, భారతి, విద్యార్థులు పాల్గొన్నారు.