షైనింగ్ స్టార్ అవార్డుకు సయ్యద్ హస్నాత్ ఎంపిక

చల్లపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు విజయ క్రాంతి జూనియర్ కళాశాల విద్యార్థిని సయ్యద్ హస్నాత్ ఎంపికైంది.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సీఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను 953 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన హస్నాత్‌కు సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందజేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ దుట్టా శివరామ ప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థిని సయ్యద్ హస్నాత్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు అభినందించి, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.