సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం…

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని బిక్కనూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పురం రాజమౌళి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఆర్యవైశ్యులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని చెప్పారు. వాసవి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఆర్యవైశ్యులు ఎల్లవేళలా సీఎంకు అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.
