Vinesh Phogat | అదరగొట్టిన వినేశ్ ఫొగాట్
Vinesh Phogat | అదరగొట్టిన వినేశ్ ఫొగాట్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శనతో రాణించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తొలుత ఆమెను 50 కేజీల కేటగిరీకే పరిమితం చేయాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో 53 కేజీల విభాగంలో బరిలోకి దిగేందుకు అనుమతించింది.
ట్రయల్స్‌లో పాల్గొనేందుకు డబ్ల్యూఎఫ్ఐ తొలుత నిరాకరించగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. “దేశానికి ఎంతో గర్వకారణమైన వినేశ్ లాంటి అథ్లెట్‌కు ఈ ట్రయల్స్‌లో అవకాశం ఇవ్వాల్సిందే” అని స్పష్టం చేస్తూ ఆమెకు లైన్ క్లియర్ చేసింది.
ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ తన తొలి బౌట్‌లో ప్రత్యర్థి జ్యోతిపై 7-1 తేడాతో ఘన విజయం సాధించారు. అదే పట్టు, అదే పవర్‌తో బరిలోకి దిగిన వినేశ్ తన జోరును కొనసాగిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.
