NBK111 Glimpse I బైక్‌ పై బాలయ్య బ్లాస్ట్‌.. ‘గోపీచంద్’ మార్క్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

NBK111 Glimpse I బైక్‌ పై బాలయ్య బ్లాస్ట్‌.. ‘గోపీచంద్’ మార్క్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

NBK111 Glimpse I ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చింది ‘NBK111’ మూవీ టీమ్. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

NBK111 Glimpse I గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించారు. ముఖ్యంగా బైక్‌పై బాలయ్య ఎంట్రీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మాస్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్‌లో బాలయ్య స్టైలిష్ ప్రెజెన్స్‌తో పాటు యాక్షన్ టచ్ కూడా కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌లోనే పవర్‌ఫుల్ బీజీఎం హైలైట్‌గా నిలిచింది. బాలయ్య–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉండగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచింది.

NBK111 Glimpse I బైక్‌ పై బాలయ్య బ్లాస్ట్‌.. ‘గోపీచంద్’ మార్క్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియోతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలయ్య మాస్ స్వాగ్, దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్, థమన్ మ్యూజిక్ కలిసి ‘NBK111’పై హైప్‌ను పెంచేశాయి.

NBK111 Glimpse

click here to read more : Sing Geetham | మూవీపై మరింత పెరిగిన క్రేజ్
click here read more:

Leave a Reply