20days | కొనుగోళ్ళు జరిగే జరిగేదెన్నడు ..!

20days | కొనుగోళ్ళు జరిగే జరిగేదెన్నడు ..!

మండుటెండల్లో మూడు గంటల నిరసన.. కలెక్టర్ రావాలని డిమాండ్..!
చిరిగిన గన్ని సంచులు పంపిణీ పై మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం..

20days | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : ఖరీఫ్ సాగు గడువు ముంచుకొస్తున్నా .. యాసంగిలో పండించిన ధాన్యం ఇప్పటికీ కొనుగోళ్లు చేయకపోవడం పై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 15, 20 రోజులుగా కల్లాల్లోనే ధాన్యం ఆరబెడుతూ, కొనుగోలు కేంద్రాల్లో పడి కాపులు కాస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ధాన్యం రైతులు అసహనం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారిపై మండుటెండలు లెక్కచేయకుండా రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తాము పండించిన వరి ధాన్యం పంటను వెంటనే కొనుగోలు చేయాలని, జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పంట నిలువలు పేరుకుపోతున్నా సరిపడా గన్ని బ్యాగులను ఇప్పటికీ సరఫరా చేయకపోవడం విండోరకరమని రైతులు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. వరి ధాన్యం తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఐకెపి సంఘాలు, అధికారులు జాప్యం చేస్తూ కొనుగోలు చేయడం లేదన్నారు. ఇప్పటికీ గన్ని సంచుల కొరత వేధిస్తోందని, వర్షం వస్తే దాన్యం తడిచిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు మార్కెట్ యార్డులకు వెంటనే లారీలను పంపించి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

20days | నిర్మల్- చించోలి రహదారిపై ధాన్యం రైతుల రాస్తారోకో..!

అంతేగాక లారీ అసోసియేషన్ ఓనర్లు ఒక్క క్వింటాలు ధాన్యానికి 10 కిలోలు కోత విధిస్తున్నారని ఆరోపించారు. పంట కొనుగోళ్లలో మధ్య దళారీలు, ప్రభుత్వం దోబూచులాడుతున్నాయని విమర్శించారు. లారీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆత్మహత్యాయత్నానికి సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సివిల్ సప్లై డిఎం వచ్చి రైతులతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది.

20days | కొనుగోలు కేంద్రాలు ఇంత అద్వాన్నమా..!

మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఫైర్..!

సిర్పూర్టి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు సమకూర్చకపోవడంపై బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధ్వజమెత్తారు. శనివారం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యం రైతుల సమస్యలను ఆరా తీశారు. తమకు చిరిగిపోయిన గోనె సంచులు ఇస్తున్నారని, వర్షం వస్తే కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు కూడా లేవని రైతులు అన్నారు. కోనప్ప మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ అవలంబిస్తోందని అన్నారు. ఇక్కడి బిజెపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దండేవిటల్ సర్పంచ్ అభ్యర్థులను కొనుగోలు చేయడంలో మాత్రం ఆసక్తి చూపుతున్నారని, రైతుల పట్ల కనికరం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే సంఘటితంగా తిరగబడతామని హెచ్చరించారు.

CLICK HERE TO READ MORE : Viral Video | ఉపాధి పనుల్లో సరదా పెళ్లి తంతు

CLICK HERE TO READ MORE

Leave a Reply