Vikram-1 Launch | విక్రమ్-1విజయంపై మంత్రి పొంగులేటి హర్షం

Vikram-1 Launch | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టం నమోదవడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విక్రమ్-1 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. భారతదేశ తొలి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్‌గా విక్రమ్-1 అంతరిక్ష ప్రయాణంలో చారిత్రక మైలురాయిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ ఆవిష్కరణలు, పారిశ్రామిక సృజనాత్మకత, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. తెలంగాణకు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, మొత్తం బృందం దేశానికి గర్వకారణంగా నిలిచిందని పొంగులేటి ప్రశంసించారు. అంతరిక్ష సాంకేతికతలో భారత్ ప్రపంచ స్థాయిలో ముందుకు సాగుతున్నదని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.