ktr | సౌదీ మృతుల కుటుంబాల‌కు స‌ర్కార్ అండ‌గా ఉండాలి

ktr } ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమ‌ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ‌ సంతాపాన్ని తెలియజేస్తున్నామ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల‌న్నారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాల‌న్నారు. అలాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాల‌న్నారు.