Vijay Devarakonda | హెచ్‌సీఏ లీగ్‌పై టీసీఏ ఆక్షేపణలు
Vijay Devarakonda | హెచ్‌సీఏ లీగ్‌పై టీసీఏ ఆక్షేపణలు
Vijay Devarakonda |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సినీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేని హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ను ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమని టీసీఏ ఆరోపించింది.
టీసీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం, బీసీసీఐ అనుమతి లేకుండానే హెచ్‌సీఏ కార్పొరేట్ సంస్థలతో కలిసి లీగ్ నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
హీరో విజయ్ దేవరకొండతో పాటు నటుడు వెంకటేష్, భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్‌లకు కూడా లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు, హెచ్‌సీఏ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. నోటీసుల నేపథ్యంలో టీజీ20 లీగ్ వ్యవహారం క్రీడా, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

