సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

  • డాక్యుమెంట్ల పరిశీలన
  • ఆన్లైన్ ట్రాన్జక్షన్లపై ఆరా

గంగాధర, ఆంధ్రప్రభ : సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళ వారం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లు ఇతర పత్రాలను పరిశీలించి డాక్యుమెంట్లు ఎందుకు పెండింగ్ పెడుతున్నారని ఆరా తీశారు.

రిజిస్టార్ కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కార్యాలయ సిబ్బందికి జరిగిన ఆన్లైన్ లావాదేవీల పై దృష్టి సారించి ఆ కోణం లో దర్యాప్తు చేస్తున్నారు.