బడ్జెట్లో బీసీలకు మొండిచేయి..

బడ్జెట్లో బీసీలకు మొండిచేయి..

బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు.

తిమ్మాపూర్, ఆంధ్ర ప్రభ : ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే బీసీలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతున్నది, కానీ బడ్జెట్ కేటాయింపులో బీసీలకు మొండి చేయి చూపుతుంది, ఈ బడ్జెట్ లో కేవలం 12511 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తున్నాది, ఇది ఈ ప్రభువంత్వానికి బీసీలపై ఉన్న ప్రేమకు నిదర్శనం. బీసీ సంక్షేమ శాఖలో లోటు బడ్జెట్ కారణంగా గత 13 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు కాలేదు, విద్యార్థుల ఫీజు బకాయిలు 7600 కోట్లు ఇప్పటివరకు మూడు సంవత్సరాల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, బీసీ వసతి గృహాలకు సరుకుల సరఫరా సరిగా లేదు, బిసి వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి, సమాజంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము.

Leave a Reply