Vajpayee|కేంద్ర మంత్రికి ఘన స్వాగతం..
Vajpayee|కేంద్ర మంత్రికి ఘన స్వాగతం..
Vajpayee, గన్నవరం, ఆంధ్రప్రభ : కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. అమరావతిలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు.
ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రాగా గన్నవరం విమానాశ్రయం సిఎస్ఓ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
