సీఎం సభకు ఉట్నూర్ నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

సీఎం సభకు ఉట్నూర్ నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, సభ ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సీఎం సభకు వెళ్లే వాహనాల కాన్వాయ్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే వాహనం ముందుండగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో కాన్వాయ్‌గా బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యుడు దూట రాజేశ్వర్, పుత్తూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, ఉట్నూర్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ నిసార్ పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సీఎం సభకు తరలివెళ్లారు.