కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇవ్వాలా చెన్నూరు మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. గతనెల 13న జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు అధికార కాంగ్రెస్ పార్టీ పోలింగ్ సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకొరకు డబ్బులు పంచుతున్నారని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ రోజు కేసు విచారణ లో భాగంగా కోర్టుకు హాజర‌య్యారు.

కోర్టుకు హాజరకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కోర్టుకు హాజరైన సుమన్ కు స్వాగతం పలికెందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు.

Leave a Reply