అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు

అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ అంబలి తాగాలని అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు బుధవారం కడం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మండలంలోని నచ్చని ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లదనం, ఆరోగ్యం కలిగించే ఉద్దేశంతో ఈ ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంబలి అనేది మన సంప్రదాయ ఆహార పదార్థమని, ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలు అంబలి వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా అలసట, దాహం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించారు.
గత 7 సంవత్సరాలుగా కడం మండలం, నచ్చన్ ఎల్లాపూర్ ప్రాంతాల్లో నిరంతరం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజాసేవలో ముందుండుతున్న డా. బొడ్డు గంగన్నను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు టి.మల్లేష్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బి.రమేష్ వర్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్ , పెద్దూర్, కడెం, చిట్యాల్, బెల్లాల్ గ్రామాల సర్పంచులు దీకొండ విజయకుమార్, చీమల భీమేష్, బొంతల లక్ష్మీ భూమన్న, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తక్కల సత్తన్న కొండాపురం లక్ష్మణ్, వాజిద్ ఖాన్, బబ్లు, తొట్ల ధర్మయ్య, ఎండి షర్ఫుద్దీన్, చెన్ను మల్లేష్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
