ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు టీఆర్ఎస్ఎంఏ (ట్రస్మా) ఉట్నూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ట్రస్మా సంఘ నాయకులు, కరస్పాండెంట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

సమావేశంలో ఉట్నూర్ ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రైవేట్ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సమస్యలను ఓర్పుగా విని సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు ట్రస్మా ఉట్నూర్ డివిజన్ నాయకులు, కరస్పాండెంట్లు కృతజ్ఞతలు తెలిపారు.