రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

వృథాగా జారిపోతున్న నీరు..

ఊట్కూర్ ఆంధ్రప్రభ: ఊట్కూర్ పెద్ద చెరువులో నిల్వ ఉన్న నీటి వృథాను అరికట్టాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం తహసీల్దార్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఊట్కూర్ గ్రామంలోని పెద్ద చెరువుకు సమృద్ధిగా నీరు చేరిందని వారు పేర్కొన్నారు. ఈ నీరు భవిష్యత్తులో గ్రామ ప్రజల తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

అయితే ప్రస్తుతం చెరువు తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతుండటంతో భారీగా వృథా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన నీరు ఇలా వృథా కావడం వల్ల రాబోయే రోజుల్లో పంటలకు నీరందక రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

చెరువులో నీరు నిల్వ ఉంటే గ్రామ ప్రజలకు, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. అందువల్ల వెంటనే నీటి వృథాను అరికట్టి చెరువులో నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, సమస్యను పరిశీలించి నీటి వృథాను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, ఆనంద్ కుమార్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ఇబాదూర్ రెహమాన్, షేక్ సమీ, తరుణ్ రెడ్డి, ఖలీక్, రమేష్, జమాల్, అంజి, బలరాం తదితరులు పాల్గొన్నారు.