కేంద్ర సినిమా బోర్డు సభ్యుడిగా దెబ్బాది శ్రీనివాస్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలో కీలక బాధ్యత దక్కించుకోవడం ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణ వాసి దెబ్బాది శ్రీనివాస్ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ రీజియన్‌లో అడ్వైజరీ ప్యానల్ సభ్యుడిగా ఆయనను నియమించడం జరిగింది. ఈ పదవీకాలం మూడు సంవత్సరాలపాటు కొనసాగనుంది.

సినీ రంగంపై అవగాహనతో పాటు సామాజిక అంశాలపై చైతన్యం కలిగిన వ్యక్తిగా పేరుపొందిన శ్రీనివాస్ కు ఈ బాధ్యతలు దక్కడం పట్ల పలువురు సినీ, సామాజిక, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం ద్వారా ప్రాంతీయ సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ ప్రాంత వాసులు అభినందనలు తెలుపుతూ, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a Reply