ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు, అరెస్టు ప్రయత్నాలను ఖండిస్తున్నాం

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు, అరెస్టు ప్రయత్నాలను ఖండిస్తున్నాం
కందికొండ మోహన్
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ప్రముఖ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ప్రయత్నాలను సీనియర్ జర్నలిస్టు కందికొండ మోహన్ ఖండించారు.
రాజకీయ చర్చలో భాగంగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.
అంతటితో వివాదం ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా, అరెస్టు చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
