జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా కే. జనార్దన్ బాధ్యతల స్వీకరణ
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడీఓ)గా కే. జనార్దన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కమలాకర్ రెడ్డి నల్గొండ జిల్లాకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన కే. జనార్దన్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా కే. జనార్దన్ మాట్లాడుతూ, త్వరలో జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన హాస్టళ్లు, విద్యాసంస్థలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
