TG | రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా గడ్డం ఉపేందర్ రెడ్డి
TG | రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా గడ్డం ఉపేందర్ రెడ్డి
మరిపెడ, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా బొట్ల కార్తీక్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా చీకటి కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు.
అదేవిధంగా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్ రెడ్డి రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు దక్కించుకోవడంతో సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గ్రామాభివృద్ధిలో వారి పాత్రను మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణతో పాటు గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
గుండెపుడి గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి పదవికి ఎన్నిక కావడం మరిపెడ మండలానికి గర్వకారణమని స్థానిక నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
