టీ-ఫైబర్ బ్యాటరీ మాయం..

పోలీసులకు ఫిర్యాదు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని గుర్రేవుల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీ-ఫైబర్ బ్యాటరీ అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై టీ-ఫైబర్ సిబ్బంది శనివారం కన్నాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సమాచారం ప్రకారం, గుర్రేవుల గ్రామపంచాయతీలో మొత్తం మూడు టీ-ఫైబర్ బ్యాటరీలు ఉండగా, వాటిలో ఒకటి కనిపించకుండా పోయింది. దీంతో బ్యాటరీ మాయమైన విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనకు సంబంధించి గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం లేదా ప్రమేయం ఉండొచ్చని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం.

బ్యాటరీ ఎప్పుడు, ఎలా అదృశ్యమైంది? దీనికి ఎవరు బాధ్యులు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వివరాలు సేకరిస్తున్నారు.