Union Minister Ram Mohan Naidu : అందరూ బాగుండాలి Andhra Prabha News

Union Minister Ram Mohan Naidu : అందరూ బాగుండాలి Andhra Prabha News

  • దేశం, రాష్ట్రం అభివృద్ధికి స్వామి ఆశీస్సులు కోరాను
  • తిరుమలలో కేంద్ర మంత్రి రామ్మోహన్​ నాయుడు

( ఆంధ్రప్రభ, తిరుమల)

Union Minister Ram Mohan Naidu : తిరుమల శ్రీవారిని ‘సోమవారం ఉదయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను, మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు స్వామి వారిని దర్శించుకున్నాం. స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి, అలాగే రాష్ట్రాభివృద్ధిలో కష్టపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను.

Union Minister Ram Mohan Naidu : ఎండల్లో జాగ్రత్త

ప్రస్తుతం వేసవికాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతికి వచ్చే భక్తులు గానీ, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని, కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ… వెకేషన్స్ (సెలవుల కాలం) కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది తిరుపతికి వస్తున్నారు. ​నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఈఓ , చైర్మన్ ఇక్కడున్న టీటీడీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందిస్తన్నా. ఎందుకంటే రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా… నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను, ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత చూస్తున్నాను, అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

Union Minister Ram Mohan Naidu : ఏర్పాట్లు చాలా బాగున్నాయి

అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలలో కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.” అపి కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడు అన్నారు.