శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో..

శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరుల్లో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి డాక్టర్ సబిత ఆనంద్, కుమారుడు వైభవ్ ఆనంద్ తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు.

Leave a Reply