Godadevi kalyanam | కళ్యాణ వేడుకలు..

Godadevi kalyanam | కళ్యాణ వేడుకలు..

Godadevi kalyanam, మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ విశ్రాంత అర్చకులు శ్రీ కారంపూడి నర్సింహా చార్యులు, యాగ్నికులు అరుణ్ కుమార్ వేద మంత్రోచ్చాల నడుమ కల్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత ఎగమాటి రాంరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శిలు ,ప్రతినిధులు, పాలక వర్గం, భక్తులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున కళ్యాణ వేడుకల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.