నలుగురు కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎంపిక

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవమైంది. శనివారం మున్సిపల్ కార్యాలయ భవనంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. నలుగురు కో ఆప్షన్స్ సభ్యుల ఎంపికపై నిర్వహించిన ఎన్నికలలో అలక శ్రవణ్ పొనుగోటి శోభ షేక్ మొగలాబి షేక్ ఖాదర్ ల లను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించగా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.