సీఎస్ఐ హైస్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం సీఎస్ఐ ఉన్నత పాఠశాలకు చెందిన 1982-83 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం దినేష్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, జానిమియా, వట్టేపు వెంకటేశ్వర్లు, సరోజిని, సువార్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ లింగంపల్లి రామచంద్ర మాట్లాడుతూ.. ఆనాడు విద్యార్థులుగా ఉండి కాలక్రమంలో ఉన్నతంగా ఎదిగిన విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉంటుందని అన్నారు.
దాదాపు 43 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం ఆనందం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, పత్తి విజయ కుమారి, సంగిశెట్టి దేవదాసు, ఇమ్మానియేలు, ప్రశాంత్ కుమార్, పెర్సీ, సత్యానందం, యాకోబు, ఫణిరామ్ ప్రసాద్,ఏలీయా, అశోక్, కనికర, వసంత, ప్రభావతి, సుశీల, ఎస్ రూతు, పి.రూతు, చంద్ర మణి, ప్రవీణ్, ప్రభుదాసు, స్వరూప, గీత, గోవర్ధన్ రెడ్డి, వరమ్మ, నవ మణి, దానియేలు, సుగుణ, సుజన, జయమ్మ, సుకన్య, ఇందిర, ప్రభాకర్, సులోచన, భాగ్యమ్మ, జి.రత్నం, ఎన్.రత్నం పాల్గొన్నారు.
