ముచ్కూర్ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత: వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సౌజన్యంతో 25 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ సహకారం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని సేవల కన్నా సమాజ సేవే గొప్పదని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పదవులు చేపట్టి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు, సమాజం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న దాతలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు, మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, కౌన్సిలర్ నీలం రవి, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, కార్మిక శాఖ అధ్యక్షుడు డిష్ గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాగౌడ్, గ్రామ సర్పంచ్ కొడిగేలా శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాశెట్టి రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు శోభ, మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఒ. భూమేశ్వర్, వీడీసీ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ ఎం.ఏ. సూర్జిల్, నాయకులు విల్సన్, శర్మ నాయక్, జీషాన్, అబ్దుల్లా, అవేజ్, పల్లికొండ అజయ్, రాజు, శ్రీను, అరుణ్, రాజేష్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.