సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…
నల్ల బ్యాడ్జీలతో నిరసన…
చిట్యాల, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలోని కేజీబీవీ లోపాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజన సమయంలో సోమవారం టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు పెద్దపల్లి యోగానంద చారి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించవలసిన 29 రోజుల సమ్మె కాలపు వేతనం వెంటనే చెల్లించాలని ,మినిమం టైమ్ స్కేలు తో ఆ పోస్ట్ కి సంబంధించిన వేతనం చెల్లించాలని కోరారు.
ఈనెల 16న నిర్వహించే జిల్లా, డివిజన్ స్థాయి నిరసన ప్రదర్శనలు, 20న నిర్వహించు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ సుమలత ,ఉపాధ్యాయ బృందం, సమగ్ర శిక్ష ఉద్యోగులు, టీఎస్ యుటిఎఫ్ సంఘ నాయకులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
