ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గ పరిధిలోని తోటమూల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామాల్లో వేసవికాలంలో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరా లోపాలు, రోడ్ల సమస్యలు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు ఇస్తున్న వినతులపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా జవాబుదారీతనం చూపాలని ఈ సందర్భంగా సూచించారు.
ముఖ్యంగా ప్రజలు సమర్పించిన అర్జీలపై తీసుకున్న చర్యల గురించి వారికి సమాచారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
