కథక్ నృత్య వర్క్‌షాప్‌తో విద్యార్థుల్లో కళాస్ఫూర్తి
స్పిక్ మెకే ఆధ్వర్యంలో భారతీయ శాస్త్రీయ నృత్యంపై అవగాహన
మునుగోడు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పిక్ మెకే తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథక్ నృత్య వర్క్‌షాప్ విద్యార్థులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి సుమన్ రంగత్ ముఖ్య అతిథిగా హాజరై భారతీయ శాస్త్రీయ నృత్య విశిష్టతను వివరించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, జానపద కళలు, యోగా, ధ్యానం వంటి భారతీయ సాంస్కృతిక విలువలను యువతకు చేరవేయడమే స్పిక్ మెకే లక్ష్యమని తెలిపారు.
అనంతరం కథక్ నృత్యంలోని ముద్రలు, భంగిమలను స్వయంగా ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని నృత్యంలోని పలు అంశాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు పెరక నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
