ట్రాక్టర్ల వినియోగంపై నిషేధం..
రైతుల రాస్తారోకో
ఉడుంపూర్‌లో ఆందోళనతో మంచిర్యాల–నిర్మల్–ఆదిలాబాద్ రాకపోకలకు అంతరాయం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో శనివారం గ్రామానికి చెందిన రైతుల అటవీ ప్రాంతంలో గల పంట భూముల్లో ట్రాక్టర్ లను వాడుకోవడానికి ఆటవిశాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక అటవీ అధికారుల తీరును నిరసిస్తూ మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ వెళ్లే ప్రధాన రహదారి ఉడుంపూర్ గ్రామం రహదారిపై గ్రామానికి చెందిన రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ రహదారిపై నడిచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఆగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత కొన్నేళ్ల నుండి అటవీ ప్రాంతంలో గల తాము పంటలు సాగు చేసుకోవడానికి ట్రాక్టర్ల ద్వారానే కేజీలు కొడతామని ప్రస్తుతం ఆటవిశాఖ అధికారులు ట్రాక్టర్లు వాడవద్దని ఆటవిశాఖ అనుమతి పేర్కొంటున్నారని రైతులు ఆరోపించారు. ట్రాక్టర్లు వినియోగించుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఖానాపూర్ ఎఫ్ డి ఓ శివకుమార్ మాట్లాడుతూ… అటవీ ప్రాంత పంట భూముల్లో ట్రాక్టర్లు వాడవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కోర్టు ఆదేశాలు తప్పకుండా అమలు చేయవలసి ఉంటుందన్నారు. ఇదివరకే రైతులకు స్థానిక అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్లు వాడవద్దని నోటీసులు కూడా అందజేయడం జరిగిందని ఇకనైనా రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని రాస్తారోకో విరమించాలని ఎఫ్డిఓ శివకుమార్ రైతులను కోరారు.
