మైలవరం నియోజకవర్గంలో 2,64,459 మంది ఓటర్లు

  • ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

మైలవరం, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎస్ ఐ ఆర్(సర్ -2026)లో భాగంగా 82–మైలవరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మొత్తం 2,64,459 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,27,737 మంది పురుషులు, 1,36,702 మంది మహిళలు, 20 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.

మండలాల వారీగా ఓటర్ల వివరాలు..

రెడ్డిగూడెం: 36,534
మైలవరం: 51,816
జి.కొండూరు: 45,260
కొండపల్లి: 47,162
ఇబ్రహీంపట్నం: 31,670
విజయవాడ రూరల్‌: 52,017
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలపై అభ్యంతరాలు, సవరణలు లేదా క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30, 2026లోగా సంబంధిత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈ ఆర్ ఓ), అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి లేదా బూత్‌ లెవల్‌ అధికారికి సమర్పించాలని అధికారులు సూచించారు.గడువులో అందిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.