కరెంట్ షాక్‌తో రెండు ఆవులు మృతి..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిన్నబెల్లాల్ (నర్సింగాపూర్) గ్రామంలో కరెంట్ షాక్ తగిలి రెండు ఆవులు మృతి చెందాయి.

గ్రామానికి చెందిన రైతు బొడ్డు సత్తన్నకు చెందిన రెండు ఆవులు మంగళవారం మేతకు వెళ్లిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ఈ ఘటనతో తనకు సుమారు రూ.80 వేల మేర నష్టం వాటిల్లిందని రైతు సత్తన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తగిన నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.