TORF | ట్రాక్ రెడీ… మీరు రెడీనా?
TORF | ట్రాక్ రెడీ… మీరు రెడీనా?
ఆంధ్రప్రభ : మోటోస్పోర్ట్స్ అభిమానులకు, అడ్వెంచర్ రైడర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్–చేవెళ్ల ప్రాంతంలో సరికొత్త ఆఫ్-రోడ్ ట్రాక్ ధూమ్ ధామ్‌గా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న మోటోక్రాస్ రైడర్లను, రేసింగ్ లవర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకువస్తూ.. ‘MX Race Weekend 2026’ పేరుతో మైండ్ బ్లోయింగ్ రేసింగ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్, అడ్రినలిన్ రష్ కలిగించే రేసింగ్ ను ‘The Off-Road Factory’ (TORF) నిర్వహిస్తుండగా.. ఈ రేసింగ్ కు కావాల్సిన ఆఫ్-రోడ్ ట్రాక్, ఈ నెల జూన్ 27 – 28 తేదీలలో ప్రారంభం కానుంది. “Be Part of History – The Track is Ready, Are You?” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో రైడర్లను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రేజీ ట్రాక్‌ను అంతర్జాతీయ సరిహద్దులు దాటేలా, ఏకంగా FIM (Fédération Internationale de Motocyclisme) గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 8 మోటోస్ (హై-స్పీడ్ రేసులు) థ్రిల్లింగ్‌గా నిర్వహించబోతున్నారు. కాగా, ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ రైడర్లతో పాటు కొత్తగా రేసింగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వారికి కూడా ప్రత్యేక అవకాశాలు కల్పించారు.

రేస్ కేటగిరీలు
- ఇంపల్స్ క్లాస్
- ఎక్స్‌పల్స్ & KLX క్లాస్
- ఓపెన్ క్లాస్ (260cc వరకు)
- ADV క్లాస్ (250cc – 450cc)
- ఉమెన్ క్లాస్
- ఫారిన్ ఓపెన్ (KX & ఇతర మోడల్స్)
- కిడ్స్ క్లాస్
- అమెచ్యూర్ క్లాస్ (ఫస్ట్ టైమ్ రేసర్ల కోసం)
ఈ మెగా రేసింగ్ ఈవెంట్‌లో ప్రతి ఒక్కరినీ అలరించేలా అదిరిపోయే రేస్ కేటగిరీలను సిద్ధం చేశారు. బైక్ లవర్స్ కోసం ఇంపల్స్ క్లాస్, పవర్‌ఫుల్ ఎక్స్‌పల్స్ & KLX క్లాస్‌లతో పాటు, 260cc వరకు ఉండే ఓపెన్ క్లాస్ రేసులు నరాలు తెగే ఉత్కంఠను పంచబోతున్నాయి. ఇంకా అడ్వెంచర్ ప్రియుల కోసం 250cc నుండి 450cc వరకు ఉండే ADV క్లాస్, సరికొత్త రికార్డుల కోసం ఉమెన్ క్లాస్, ఇంటర్నేషనల్ రేసింగ్ బైక్స్ KX వంటి మోడల్స్‌తో దుమ్మురేపడానికి ఫారిన్ ఓపెన్ కేటగిరీలను కూడా డిజైన్ చేశారు. వీటితో పాటు భవిష్యత్ ఛాంపియన్ల కోసం కిడ్స్ క్లాస్, అలాగే మొదటిసారి రేసింగ్ ట్రాక్ పై అడుగుపెడుతున్న కొత్త రైడర్లను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా అమెచ్యూర్ క్లాస్‌ను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఈ రేస్ వీకెండ్‌లో మహిళలు, పిల్లలు, అడ్వెంచర్ రైడర్లు, అమెచ్యూర్ రేసర్ల వరకు అందరికీ వేదిక కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రొఫెషనల్ ట్రాక్ డిజైన్, టాప్-నాచ్ ఫెసిలిటీస్, హై-ఎండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఈ ఈవెంట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానున్నాయి. విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలు అందించనుండగా, పాల్గొనే ప్రతి రైడర్‌కు మెమరబుల్ రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ మోటోక్రాస్ రైడర్లు, ఆఫ్-రోడ్ బైకింగ్ కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
