Virat Kohli Olympics | ఒలింపిక్స్‌లో కోహ్లీకి ఛాన్సివ్వాలి
Virat Kohli Olympics | ఒలింపిక్స్‌లో కోహ్లీకి ఛాన్సివ్వాలి
మాజీ క్రికెటర్ శ్రీశాంత్
Virat Kohli Olympics | ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్: 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగాలంటే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కోహ్లీతో కలిసి ఆడిస్తే అద్భుతమైన కాంబినేషన్ అవుతుందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ అనుభవం, వైభవ్ దూకుడు టీమిండియాకు ప్రత్యేక బలంగా మారుతాయని అన్నారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మేళవింపు ఒలింపిక్స్ వంటి వేదికపై భారత్‌కు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్రికెట్ 128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి తిరిగి రానుండటంతో జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కోహ్లీని ఒలింపిక్స్ జట్టుకు పరిగణనలోకి తీసుకోవాలని శ్రీశాంత్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
