ఆలేరు అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి..

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక మంగళవారం జరిగిన సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడారు. ఎంపికైన 12 మంది కౌన్సిలర్లు, 4 గురు కోఆప్షన్ మెంబర్లు ఆలేరు మున్సిపల్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం, నీటి సరఫరా తోపాటు వివిధ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు. ఎంపికైన కో ఆప్షన్స్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి,టిపిసిసి ప్రధాన కార్య దర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సిపిఎం నాయకులు కల్లూరి మల్లేశం, ఎమ్మే ఇక్బాల్, మొరిగాడి రమేష్, జూకంటి పౌల్, దూపటి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు జెట్ట సిద్దులు, మార్క్,మల్లెల శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply