ఊర కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
జన్నారం, ఆంధ్రప్రభ: కవ్వాల టైగర్ రిజర్వ్ పరిధిలోని తాళ్లపేట రేంజ్‌లోని తపాల్‌పూర్ అడవుల్లో ఊర కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి మృతి చెందింది. గ్రామ సమీపానికి వచ్చిన దుప్పిపై ఊర కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయని, ఈ ఘటనలో చుక్కల దుప్పి అక్కడికక్కడే మృతి చెందినట్లు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. వికాస్ మంగళవారం సాయంత్రం తెలిపారు. అనంతరం వెటర్నరీ వైద్యుడితో దుప్పికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది అడవిలో గుంత తవ్వి దుప్పిని ఖననం చేసినట్లు వెల్లడించారు.
