డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మూడు రోజుల జైలు శిక్ష
గోనెగండ్ల, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని కున్నూరు గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి మద్యం తాగి మోటార్ సైకిల్ నడిపినందుకు పత్తికొండ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ చంద్రబాబు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మండల ప్రజలకు సూచించారు. ఒకవేళ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
