ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టాలి

ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టాలి

-ఏబీవీపీ డిమాండ్

చిట్యాల, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఏబీవీపీ చిట్యాల నగర కార్యదర్శి వంగూరి గణేష్ ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే నియంత్రణ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశిత దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫామ్‌లు కొనాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులకు కనీసం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. భద్రతా లోపాలు ఉన్న వాహనాల్లో విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సిద్ధు, యశ్వంత్, పుల్లెంల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply