Choutuppal | ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

Choutuppal | ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్ ఐఐటి జోన్ లో జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు రైతు వేషధారణ చేసి పంట పొలాల పనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ట్రినిటీ హైస్కూల్ కరస్పాండెంట్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ విద్యార్థులకు రైతులు పండించే వివిధ రకాల పంటలు ఎలా పండుతాయో అవగాహన కల్పించారు.

విద్యార్థులకు రైతు వేషధారణ వేయించి నాగలి, ఎడ్లబండ్లు, వివిధ రకాల కూరగాయల ప్రదర్శన చేసి విద్యార్థులకు రైతులు చేసే పని గురించి, నీటిని పొదుపు చేసే ప్రక్రియ గురించి వివరించారు. విద్యార్థులు తినే ఆహారం వ్యర్థం చేయవద్దని తెలిపారు. రైతులను గౌరవించాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కే వి బి కృష్ణారావు, ఉపాధ్యాయులు అనూష, చందన, జ్యోతి, శిరీష, అనసూయ, సంతోష, రాణి, హారిక, రత్న భార్గవి, సింధు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
