మల్లెల గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులకు శ్రీకారం
మల్లెల గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులకు శ్రీకారం
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మండలం మల్లెల గ్రామంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వాతావరణం పెంపొందించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఈ పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ పార్కు ఏర్పాటుతో చిన్న పరిశ్రమలు, సేవారంగ సంస్థలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Slug:
