చేపల మార్కెట్‌లో దాగి ఉన్నదేమిటి?
చేపల మార్కెట్‌లో దాగి ఉన్నదేమిటి?
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నగరంలో కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాల వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం పీపీ చావడి మాంసం మార్కెట్‌లో అర టన్నుకు పైగా కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్న ఘటన ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
గురువారం తిరుపతి నగరంలోని లీలామహల్ కూడలి వద్ద ఉన్న చేపల మార్కెట్‌లో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా ఐదు బాక్సుల్లో నిల్వ ఉంచిన 300 కిలోలకు పైగా కుళ్లిపోయిన చేపలను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
నగరంలో వరుసగా కుళ్లిన ఆహార పదార్థాలు బయటపడుతుండటంతో వినియోగదారులు ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
